Find us on Google+ www.AndhraJyothi.co.in

Why Lord Siva Dont Have Home ??

Wednesday, September 10, 2014
శివుడికి ఇల్లు ఎందుకు లేదు?

ఒకనాడు పార్వతీదేవి శివుడితో! స్వామి ఇంద్రుడికి గృహం ఉంది, దేవతలకి గృహాలు ఉన్నాయి. కాని మనకి మాత్రం లేదు. కట్టించండి అని అడిగింది. అప్పుడు శివుడు! ఒద్దు పార్వతి. మనకి ఇల్లు అచ్సిరాదు. ఆలోచన మానుకో అన్నాడు. కాని పార్వతి కాదు కుదరదు అనేసరికి. సరే అని అమరాశిల్పిని పిలిపించి అత్యద్భుతమైన ఇల్లు ఒకటి కట్టమని ఆజ్ఞాపించాడు. అమరశిల్పి తక్షకకోటిని పిలిపించి బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. గృహప్రవేశానికి అందరికి ఆహ్వానం పంపించారు. ఎవరికి ఏ వరం కావాలో కోరుకొండి అడిగిన తక్షణమే ఇచ్చేస్తా అన్నాడు. ఆ ఆహ్వానం రావణాసురుడికి కూడా వెళ్ళింది. గృహప్రవేశానికి అందరు వచ్చి వరాలు అడిగి తీసుకుంటున్నారు. రావణుడు వంతు వచ్చింది. రావణుడు! శివ ఏవరం కావాలన్నా లేదనకుండా ఇస్తాను అని మాట ఇచ్చావ్ కనుక అడిగింది కాదనకూడదు అన్నాడు. సరే ఏమి కావాలో అడగమంటే ఈ ఇల్లు నచ్చింది. ఇచ్చేసేయి అనేసరికి శివుడు పార్వతి ఆశ్చర్యపోయి ఏమిచేయలేక ఇస్తున్నా తీసుకో అని ఇచ్చేశాడు. అక్కడికి ఒక ఇల్లు ఇచ్చేశారు. ఇంకోన్నిరోజుల తరువాత మళ్లి అడిగింది. మళ్లి దేవశిల్పిని పిలిపించి మల్లి కట్టించాడు. ఈ సారి రావణుడిని పిలవలేదు. ఐతే గృహప్రవేశానికి ''శని'' వచ్చాడు.
ఆయన్ని చూడగానే అగ్నిహోత్రుడు గజగజ వొణికిపోయాడు. నన్ను ఏమి చేస్తాడో శని అనుకుని భయంతో ప్రజ్వలించి ఆ ఇంటిని కల్చేశాడు. అలా రెండో ఇల్లుకూడా పోయింది. పార్వతీ మనకి ఇల్లు అచ్చుబాటు లేదు, ఒద్దు అని చెప్పాను కదా! ఇంకా ఇంటిమీద ఆశలు వదిలిపెట్టు అనగానే చేశేది లేక సరే అని ఊరుకుంది. ఆ విధంగా శివుడికి ఇల్లు లేకుండా పోయింది.
Read more ...

What To Watch After Walk Up From Bed

Wednesday, September 10, 2014
మనం సాదారణంగా ఏదైనా పని చేసినప్పుడు లేదంటే ఆ రోజు ఏమి కలిసిరానప్పుడు ''పొద్దున్నే లేచి ఎవరిముఖం చూశానో కాని'' అని ఎత్తుకుంటారు. 
ఉదయం లేవగానే దేవుడి ముఖం కనిపించేలా కాళ్ళ దగ్గర మీకు నచ్చిన దేవుడి చిత్రపటం చుడండి. కాళ్ళ దగ్గర పెట్టుకుంటే అపచారం కదా అని కొందరికి సందేహం. కాళ్ళదగ్గర అంటే కళ్ళకి తగిలేలా పెట్టుకోవడం లేదు కదా ఎదురుగ వున్నగోడకి తగిలిస్తున్నాం. అంతే కాకుండా దేవుడు సర్వాంతర్యామి. అయన సర్వం నిండి ఉన్నాడు. అలాంటప్పుడు నీ కాళ్ళ దగ్గరే ఉన్నాడు అని ఎందుకు అనుకుంటున్నారు. కానీ మనసులో గిలి ఉన్నవారికి ఇంకో చిన్న సందేశం.
ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులు చూసుకోండి. దీనికి కూడా ఒక కారణం ఉంది.
అరచేతి ముని వెళ్ళు లక్ష్మి దేవి స్థానం. అరచేయి సరస్వతి స్థానం, అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం. దీనికి ప్రమాణం ఏంటి అని సందేహమా?
లక్ష్మీదేవి చంచలం అనే విషయం అందరికి తెలుసు కదా! ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికి తెలియదు. అందుకని ఎప్పుడు దూకేద్దామా అని మునివేళ్ళ మీద కుర్చుని వుంటుంది. మనం ఎవరినైనా డబ్బు గురించి అడిగేటప్పుడు బొటనవేలు చూపుడువేలు టిక్కు టిక్కు మని కొడుతూ అడుగుతాం కదా. అలాగే సరస్వతి దేవి అరచేతిలో ఉంటుంది. మనం పుస్తకం పట్టుకుని చదవాలనుకుంటే అరచేతిలోనే పట్టుకుంటాం. ఏమి చేస్తున్నావు అని ఎవరైనా అడిగితె అరచేతులు రెండు దగ్గర పెట్టు ముడిచి చదువుతున్నాను అని చూపిస్తాం. అలానే మనం ఎవరిననైన కొట్టాలి అనుకున్నా, లేక కోపం వచ్చిన పిడికిలి బిగిస్తాం. ఆ పిడికిలి బలం (శక్తి) అంతా మణికట్టు మీదే ఆధారం. కనుక అరచేతిని చూసుకుంటే ముగ్గురు అమ్మల్ని దర్శించినట్టు ఉంటుంది. ఎవరిని తిట్టుకోకుండా ఉంటాము. కాబట్టి మీకు వీలైన పద్దతిని వాడుకోండి
Read more ...

Why People Loosing Their Age

Wednesday, September 10, 2014
మానవుల ఆయుర్దాయం ఎందువలన క్షీణిస్తుంది? పెంపొందాలి(పెరగాలి) అంటే ఏమిచేయాలి?

ఓర్పు, సత్యం పలకడం, కరుణ, శౌచము(శుచి,శుబ్రత), మాతృ పితృ, గురుభక్తి (ఆధ్యాత్మిక గురువు. అలాగని విద్యలు నేర్పించిన గురువుని అవమానించమని కాదు సుమా!), వీటితోపాటు ఆ ఆ వ్యాధుల వలన కలిగే భాధలకు తగిన ఔషదులు సేవించడం, బ్రహ్మచర్యము, మితాహారము, హితవాక్యములు తెలియజెప్పడం, వలన ఆయుష్షువృద్ధి చెందుతున్నది. కేవలం పూర్వ పుణ్యం వలననే ఇటువంటి సదాచార, దురాచార సంపత్తిపై ఆశక్తి, మక్కువ కలుగుతున్నది.
క్రోధము, అహంకారము, అసత్యము, శుచిలేమి, తనవల్లకాని పని భారాన్ని నెత్తిన పెట్టుకున్నా, అపథ్యమైన ఆహారం (పానిపూరి, పిజ్జాలు, బర్గర్లు, సాన్ద్విజ్లు, బయట బళ్లమీద ఈగలు, దోమలు, ధూళి కలగలసిన ఆహారం) స్వీకరించినా, అనాటికానాటికి ఆయుష్షు క్షీణింపజేస్తున్నవి. ఇటువంటి దురాశక్తి గతజన్మ పుట్టుక పాతిత్యం వలననే సంభవిస్తున్నది. పాపాత్ములు ఎక్కువకాలం నరకంలో నివసించి భూలోకంలో అల్పమైన అయుర్ధాయంతో జన్మించి అర్ధంతరం(ప్రమాదంలో కాని, ప్రక్రుతి విపత్తులలో గాని) నశిస్తారు. మరలా యమలోకంలో యమదండనలు అనుభవిస్తారు.
Read more ...

Kali Bhagavan Effects - Now A Days People Changes According To Kali Bhagavan

Wednesday, September 10, 2014
హైందవ సంప్రదాయంలో అనేక మంది దేవతలకు అనేక శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చదివితే ఒక్కక్క ఫలితం అని ఫలస్మృతి ఉంటుంది. ఒకసారి చదివితే ఒక ఫలితం, వంద సార్లు చదివితే మరో ఫలితం, నిత్యం పటిస్తే ఈ ఫలితం, ఫలానా సమయంలో అంటే సంద్యా సమయంలో గాని, మరే సమయంలో అయినా కావచ్చు. ఎందుకంటే సమయాన్ని బట్టి మనం చదివితే ఫలితం త్వరగా వస్తుందని భావం. ఇలా అనేకరకాల ఉపాసనా పద్దతులు మన హైందవ సంప్రదాయంలో ఉన్నాయి. ఇలాగే వ్రతాలు, నోములు అని కుటుంబం కోసం నిర్దేశించినవి మరికొన్ని ఉన్నాయి. ఆరోగ్యం కోసం మరికొన్ని ఉన్నాయి. ఇలా ప్రతి విషయంలో కూడా ఆ విషయానికి సంబంధించిన అదిదేవతను అనుసంధానించే అనేకానేక మంత్రాలు, వాటి ఉచ్చరణలు, బీజక్షారాలు మన సంప్రదాయంలో సనాతనధర్మంలో ఎందరో ఋషులు ప్రత్యక్షంగా వీక్షించి మనకి అందించారు. కాని మనలో చాలామందికి ఉపాసనా మర్మాలు తెలియవు. ప్రత్యేకించి ఇప్పటివారికి ఇవి మూఢనమ్మకాలు అయిపోయాయి. చెప్పే ప్రయత్నం చేస్తే చాదస్తం అంటున్నారు. ఇలా చెప్పాలని ప్రయత్నించేవారిని వేలివేసినంతపని చేస్తున్నారు. ఇదే కలియుగధర్మం. ఈకలియుగంలో కలిపురుషుడు చేసే మొట్టమొదటి పని దైవనామ సంకీర్తనం ఏ ఇంటా లేకుండా చేయడం. ఇదే కలిపురుషుని లక్ష్యం. ఈపని చేస్తే తొందరగా బ్రష్టు పట్టించవచ్చు. కుటుంబాలకు కుటుంబాలని నాశనం చేసేయవచ్చు. వంశాలని కూకటి వేళ్ళతో సహా పెకిలించవచ్చు. ఇవన్ని చేయాలంటే దైవాన్ని ఎదిరించాలి. అందుకే చాలామంది మనస్సులో తిష్టవేసుకొని కూర్చున్నాడు. కలిచేత అవహించబడి ఉన్నవారు అన్నివిషయాల్లో ముందు నేనున్నాను నీకెందుకు అంటూ వెనుకనుండి నెడతారు. అసలువిషయం వచ్చేసరికి పారిపోతారు. సలహాలు సూచనలు ఇస్తారు. లేని అలవాట్లు చేస్తారు. ఇన్ని చేసి భక్తి విషయంలోకి వచ్చేసరికి భక్తుడిలా నటిస్తారు. లేదా నాస్తికుడిలా మారిపోతారు. ఎవరైనా భక్తికి సంబంధించి ఏదైనా చెపితే తురకవాదం చేస్తారు. ఆ వాదన విన్నవారికి కూడా నిజమే అనిపించెంతలా మాట్లాడతారు. మొత్తం మీద ఈ మూర్ఖుడు మరో కొందరు మూర్ఖులను తాయారు చేస్తాడు. ''అందుకే మన పెద్దలు అంటారు. నాస్తికులతో స్నేహం, భక్తులతో ఖేదం పనికిరాదు.'' అని. ఈవిధంగా ఎన్నో విధాలుగా దైవనమస్మరణ చేయకుండా అడ్డుపడుతూనే ఉంటాడు. ఎందుకంటే కలియుగ ప్రత్యేకత కేవలం దైవనామ స్మరణ మాత్రమే. కొంతమంది భక్తులు కూడా గుడికి వెళ్లి నమస్కరిస్తారు, ఇంట్లో పూజలు చేస్తారు కాని భగవంతుని లీలలు, భవత్కతలు వినాలంటే మాత్రం మనస్సురాదు.

ఇక విషయంలోకి వద్దాం.

మనిషి ఎప్పుడు ఐదు స్థితులలో ఉంటాడు. 1. సృష్టి-పుట్టడం, స్థితి-బ్రతకడం, లయ-నిద్రించడం లేక మరణించడం, తిలోధార(బంధం), అనుగ్రహ(మోక్షం). మొదటి నాలుగు కొన్ని సంబంధం ఉండి, కొన్ని లేక జరుగుతున్నాయి. కాని చివరిది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే బంధం అడ్డుతగులుతుంది. ఈ బంధాన్ని దాటి ముందుకు వెళితే పరబ్రహ్మ తత్త్వం తెలుస్తుంది. ఆ తత్త్వమే సర్వం వాసుదేవమయం. అది తెలుసుకోవడమే మోక్షం. ఇవి పొందడం కోసం మనకి ఋషులు ఎందఱో బీజాక్షరాలతో కూడిన శ్లోకాలు, మంత్రాలు మనకి అందించి చదవమన్నారు. ఇవి చదువుతూ ఉంటే వాటి ఫలాలు మనకి అందుతాయి. ఎలాగంటే మానవుడి దారి మోక్షప్రాప్తి. ఆ దారిలోకి అడుగుపెట్టే విధంగా మనం చదివే శ్లోకాలు మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. ఎప్పుడైనా ఒకసారి చదువుతుంటే అది జన్మజన్మలకు ''ఇంతింతై వటుడింతై అన్నట్లు'' మీకు తోడుగా వచ్చి మీలో నిద్రావస్థలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. వారానికో నెలకో చదువుతుంటే ఇంకొంచం త్వరగా మేల్కొంటుంది. అదే నిత్యం చదువుతూ ఉంటే ఇంకా త్వరగా చైతన్యం మేల్కొని జన్మలు తరిగిపోయి మోక్షప్రాప్తికి సుగమం ఏర్పడుతుంది. అంటే మనం చదివే విధానాన్ని బట్టి మనలో ఉన్న చైతన్యం మేల్కొంటుంది. ఇవి చదవాలి అంటే మనలో దీక్ష, పట్టుదల ఉండాలి. ఒకరోజు , రెండు రోజులు, వారం రోజులు చదివి వదిలేయకూడదు. మొదట్లో కొంచం కష్టం అనిపిస్తుంది. కాని నిరంతర సాధన చేయగా చేయగా మనదేహం అలవాటు పడుతుంది. మధ్యలో కలిపురుషుడి వలన ఎన్నో అడ్డంకులు కూడా తగులుతాయి. అవి ఇంట్లో ఉండవచ్చు, బయటి నుండి రావచ్చు. ఏది వచ్చినా పట్టుదలతో ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా యిట్టె తొలగించవచ్చు.

ఐతే మనలో ఎన్నో విషయాలకి లొంగిపోయే గుణాలు ఉంటాయి. కలి ముందుగా వాటినే చూస్తాడు. ఎందులో ఐతే తొందరగా పడి వెళ్ళే దారి నుండి పక్కకి తప్పుకుంటావో చూసి వాటి మీద దృష్టి కేంద్రీకరించి నీ దృష్టిని ఆ మార్గం నుండి తప్పిస్తాడు. భార్య రూపంలో, తల్లిదండ్రి రూపంలో, బిడ్డల రూపంలో, ఉద్యోగ-వ్యాపార, స్నేహ, బంధు రూపంలో ఇది అది అని కాకుండా ఎలాగైనా రావచ్చు, అన్నిటికి ఎదిరించి నిలబడాలి. అప్పుడే విజయం సాధిస్తారు. అమ్మయిల కోసమో, ఆస్తుల కోసమో, ఉద్యోగ-వ్యాపార, స్నేహం కోసమో లేక మరే ఇతర వస్తువుల కోసమో తెగించడం అంటే అది బంధంలో నిన్ను నువ్వు ఇరికించుకోవడం తప్ప మరొకటికాదు. ఇక్కడ ఒక సందేహం వస్తుంది అందరికి. ఇలా మోక్షం మోక్షం అంటూ తిరిగితే సంపాదన ఎలా? అని పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు ఒక్కటే.

నువ్వు నమ్మింది బంధు మిత్ర, సపరివారం కాదు. దైవాన్ని నమ్ముకున్నావు. ఎలాంటి సమస్య గాని, ఆర్థిక పరమైన ఇబ్బందులు గాని రావు. నేనే ఇందుకు సాక్ష్యం. నా జీవితంలో అనుకోని ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇంకా ఉంది..
Read more ...

How To Do Meditation Dhyanam In Telugu With Youtube Videos

Wednesday, September 10, 2014
How To Do Meditation Dhyanam In Telugu With Youtube Videos
నిద్ర ఎరుకలేని ధ్యానం.  ధ్యానం ఎరుకతో నిద్ర. నిద్రలో మరిమిత శక్తిని పొందుతాం. ధ్యానంలొ అపరిమితంగ శక్తిని పొందుతాం. ఈ శక్తి మన శరీరిక, మానసిక, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తులను ప్రభావితం చేస్తుంది.  ఇది మన అతీంద్రియ శక్తిలిని కూడా ప్రభావితం చేస్తుంది.  ధ్యానం ద్వార మనం పోందె శక్తివల్ల శారీరిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉన్నత విచక్షణ జ్ఞానం పోందుతాము. మహద్భుత జ్ఞానాన్ని పోందడానికి ఏకైక మార్గం ధ్యానం. దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పోందడానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది.  ధ్యానం అంటె మరేమి కాదు. ఎరుకతో మనలోకి మనం చేసె ప్రయాణం.  ధ్యానంలొ మన చైతన్య పదార్తము శరీరం నుంచి మనసుకు, మనసునించి బుద్ధికి, బుద్ధినించి ఆత్మకు ఎరుకతో ప్రయాణం చేస్తుంది.

ఇప్పుడు ధ్యానం ఎలా చేయ్యాలో తేలుసుకుందాము.

ధ్యానం కోసం మనం మొదట శరీరాన్ని మనసును నిలువరింపచేయాలి.
అంటే శారీరిక కదలికలును, చుడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించడాన్ని నిలుపివెయ్యాలి.
ధ్యాననికి ముఖ్యమైనది ఆసనం.
స్థిరమైన, సుఖమైన ఏదైన ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి.

నేలమీదగాని మరే ఇతర కుర్చీలు బల్లలులాంటి వాటిమీద కుచొని కూడా చేయ్యవొచ్చు.
ధ్యానం ఏ సమయములోనైన చేయ్యవొచ్చు.
ముఖ్యమైనది అనుకూలంగవుండగలిగే స్థలం అయ్యి ఉండాలి.

హాయిగ కూచొని కాళ్ళు రెండూ ఒకదానితొ ఒకటి చేర్చి చేతివేళల్లొ వేళుంచి కళ్ళుమూసుకొని లోపలగానీ బైటగాని ఏ శబ్ధము చేయ్యకుండా ఏ మంత్రము జపించకుండా శరీరాన్ని పూర్తిగా తేలిక చెయ్యాలి.

మనం కాళ్ళను కలిపి చేతివేళల్లో వేళ్ళు కలపడం ద్వార మన చుట్టూ శక్తివలయం ఏర్పడుతుంది.
మన ఆసనంలో స్థిరత్వాన్ని పెంచుతుంది.
కళ్ళు మనోద్వారాలు.
కాబట్టి కళ్ళురెండూ మూసికొవాలి.

మంత్రోచ్ఛారణగాని మరే ఇతర శబ్ధముగానీ చేయడం మనసు చేసె పని.
కాబట్టి దాన్ని సంపూర్ణంగ నిలిపి వెయ్యాలి.
ఎప్పుడు శరీరం సంపూర్ణంగా స్థిమితమౌతుందో అప్పుడు చైతన్యము శరీర పదార్థంనుంచి మనో బుద్ధి పదార్థాలవైపు ప్రాయాణం చేస్తుంది.
మనస్సు మరేమీ కాదు, ఆలొచనల పుట్ట.
అనుక్షణం ఎన్నొ ఆలొచనలు మొదలౌతునే ఉంటాయి.
వాటివెనుక మరెన్నో ప్రశ్నలు … తేలిసినవి, తేలియనివి.
చైతన్య పదార్థాన్ని మనో బుద్ధి పదర్థాలనుంచి ఆత్మవైపు ప్రాయాణింప చేయాడానికి మనం చేయవలసిన పని మన సహజమైన శ్వాసను గమనించడం.
గమనించడం అనేది ఆత్మయోక్క ప్రక్రియ.
సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్థూ ఉందాలి.
ప్రయత్నపూర్వకంగా శ్వాసప్రక్రియను చేయ్యరాదు.

తనకు తానుగా శ్వాసప్రక్రియ జరుగుతూఉండాలి.
సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి.
ఇదే ధ్యాననికి మూలము.
ఇదే ధ్యాననికి మార్గము.

ఆలొచనలవెంట పోరాదు.
ప్రశ్నలలో చిక్కుకోరాదు.
ఆలొచనలవెంట పోరాదు.
ప్రశ్నలలో చిక్కుకోరాదు.

ఆలోచనలను తుంచి ధ్యాసను శ్వాసవైపు మరల్చాలి.

సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి.
పూర్తిగా శ్వాసతోనే ఉండాలి.
అప్పుడు ఆలోచనల సాంద్రత క్రమంగా తగ్గడం మొదలౌతుంది.
క్రమంగా శ్వాసపరిమాణం కూడా పలుచుబొడుతూ చిన్నదౌతూ వస్తుంది.
చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్నుమమ్ముల మధ్య చిన్న వెలుగుగా వుండి పోతుంది.
ఈ స్థితిలో ఆలోచనలు వుండవు. శ్వాస కూడా వుండదు.
ఇదే ఆలోచనారహిత స్థితి.
ఇదే నిర్మల స్థితి.
ఇదే ధ్యాన స్థితి.
ఈ స్థితిలోనే విశ్వ శక్తి మనలోకి ప్రవహించడం మొదలౌతుంది.
ఎప్పుదైతె మనం అధికంగా ధ్యానం చేస్తామో అధికంగా విశ్వ శక్తిని పొందడం జరుగుతుంది.
అలా పొందిన విశ్వ శక్తి మన ప్రాణమయ శరీరంలోకి ప్రవహిస్తుంది
Read more ...