Find us on Google+ Kanipakam Vinayaka Temple History In Telugu | www.AndhraJyothi.co.in

Kanipakam Vinayaka Temple History In Telugu

Saturday, September 6, 2014
కాణిపాకం గ్రామం మన రాష్త్రంలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఉంది.ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి కులోత్తుంగ చోలుడు నిర్మించగా,1336లో విజయనగర రాజులు అద్బుతంగా తీర్చిదిద్దారు.ఇక్కడి స్టలపురాణం ప్రకారం స్వామివారి విగ్రహం రోజురోజుకి పెరుగుతూఉంది. ఐతే ఈ దేవాలయం మాత్రం దాదాపు 10-15 సంవత్సరాలనుండి బాగ ప్రాచుర్యంలోకి వచ్చింధని చెప్పుకోవాలి.దీనికి కారణం ఆంద్రప్రడేశ్ ప్రభుత్వం ఈ మద్యకాలంలో టూరిజంపై ద్రుష్టి పెట్టటమే.తిరుపతి వచ్చిన భక్తులంతా కాణిపాకం తప్పక దర్శిస్తారు,ఇందుకోసం తిరుపతినుంచి ప్రత్యేక బస్సులు కాణిపాకానికి వేయటం జరిగింది. స్టలపురాణం: కాణి అనగా మాగాణి అనీ,పాకం అనగా ప్రవాహం అనీ అర్థం. కాణిపాకం అంటే మగాణిలోనికి ప్రవహించిన నీరు అన్నమాట.అసలు ఈపేరు ఎందుకొచ్చిందో పరిసీలిస్తే పూర్వం ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు.వాళ్ళలో ఒకరు చెవిటి,ఒకరు మూగ,మరొకరు గుడ్డివాడు.వాళ్ళొక చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించెవాళ్ళు.రాయలసీమలో వ్యవసాయమంతాకూడ ఎక్కువగ బావులపై ఆదారపది జరిగేది (ఇప్పటికీ).

వారు రోజూ బావిలోని నీటిని తోడి కాలువల ద్వారా పొలానికి మళ్ళించేవారు,ఒకరోజు బావిలోని నీరు అదుగంటటంతో వారిలో ఒకరు బావిలో దిగి తవ్వటం మొదలెట్టాడు. కొంతసేపటికి అడుగున ఒక శిల అడ్డుపడింది. ఉన్నట్టుండి దానినుంచి రక్తం కారటం మొదలైంది, కొంతసేపటికే ఆ బావిలోని నీరంతా రక్తంతో కలసి ఎర్రగా మారిపోయింది. వెనువెంటనే వారి అంగవైకల్యాలన్ని తొలగిపొయాయి.ఈ విషయం తెలిసిన గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని ఆ శిలని బయటకి తీయటంకోసం విఫలయత్నం చేస్తుండగా పైకి ఎగచిమ్ముతున్న నీళ్ళలోనించి సహస్రకోటి సూర్యప్రభా సమాన్వితుదైన వరసిద్ది వినాయకుడు ఉద్బవించాడట. గ్రామస్థులంతా అమిత శ్రద్దాసక్తులతో టెంకాయలు సమర్పించి దూపదీపాలతో సేవించసాగరు.ఈ సందర్బంగా కొట్టిన టెంకాయల నుంచి వచ్చిన కొబ్బరినీళ్ళతో ఆ చుట్టుపక్కల పొలాలన్నీ తడచిపోయాయట!అంటే కొబ్బరి నీరు ఇలా ప్రవహించటాన్ని తమిళంలో "కాణిపరకం" అంటారు.ఆ పదమే కాలక్రమేణా కాణిపాకంగా మారిపొయింది.

భావి మద్యలో స్వయభువుడిగా వెలసిన స్వామివారిని మనం ఈనాటికి దర్శనం చేసుకోవచ్చు. మొదట్లోకన్న విగ్రహం పరిమాణం పెరిగింది. లక్ష్మమ్మ అనే భక్తురాలు స్వామివారికి సమర్పించిన కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవటంలేదంటే విగ్రహ పరిమాణం పెరుగుతున్నదని అర్థమవుతుంది.ఈ భవిలోని నీటినే భక్తులకు తీర్థంగా ఇస్తారు.ఈ క్షేత్రంలో ప్రవహించే బహుదా నదికి ఒక పురాణగాథ ఉన్నది.పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు కాణిపాకాన్ని దర్శించటానికి వస్తూ మార్గం మద్యలో ఒకచోట ఆగారట! భాగా అకలితోవున్న లిఖితుడు అన్న వారిస్తున్నా వినకుండా ఒక చెట్టునుంచి మామిదిపండు కోసుకొని తిన్నాడట! సత్యదర్మాన్ని ఆచరించే శంఖుడు ఈ విషయాన్ని స్థానిక ప్రభువుకు నివేదించి చేసిన పనికి శిక్ష విదించమని ప్రాదేయపడ్డాడట.ఆ రాజు లిఖితుడికి రెండు చేతులు కందించమని చెప్పగా భటులు ఆ శిక్షని అమలు చేసారు.శంఖుదు అవిటివాడైన తన తమ్ముదిని తీసుకుని కాణిపాకం చేరి అక్కడి నదిలో స్నాంచెయ్యగానె లిఖితుడి రెండు చేతులు తిరిగి వచ్చాయట! ఆనాటినుండి ఆ నది బహుదా (అనగా భాహువులు) నదిగా పిలవబడసాగింది.

అంతేకాక ఈ సంఘటనతో స్వామివారిని సత్యానికి ప్రతిగా చెప్పుకుంటారు.ఈరోజుకి ఏ గొడవలు,సమస్యలు వచ్చినా ఇక్కడే పరిష్కరించుకుంటారు. నిందమోపబడిన వ్యక్తి బహుదాలో స్నానం చేసి స్వామివారి ముందు ప్రమాణం చేయాలి. తప్పుచేసినట్లైతే అతడు ఆలయప్రవేశానికి పూర్వమే స్వామివారి ఆగ్రహానికి గురౌతాడని భక్తుల ప్రగాడ నమ్మకం.ఈ ప్రమాణాన్ని కోర్టులుసైతం గౌరవిస్తాయంటె స్వామివారి శక్తి ఏంటో అర్థమౌతుంది

No comments:

Post a Comment