బ్బు డబ్బు డబ్బు ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఈరోజు ఆస్థి అంతస్తు లేకపోతె చిల్లిగవ్వకి కోరగారు. అబ్బాయిలకి కట్నం పిచ్చి. పోనీ కట్నం అడిగినంతా ఇచ్చి చేస్తే పెళ్ళాం పుట్టింటి వారి దగ్గర ఉన్న ఆస్థి కూడా కావాలి. లేకపోతె ఇటు భార్యకి, అటు అత్తమామలకి వీర వాయింపుడే. నరకం బోర్డు పెట్టిస్తాడు ఇంటిముందు. ఇలాంటి పోరంబోకులు చాలామంది ఉన్నారు. అనుక్షణం చిత్రహింసలు అనుభవించే దేవతల లాంటి భార్యలు ఉన్నారు. ఎంత సర్దుకుపోయినా నరకం చూపిస్తున్నారు భర్తలు. ఇదంతా ఒక విభాగం.
ఇకపోతే యువతి యువకుల్లో అబ్బాయిల్లో చాలామంది అమ్మాయిల్ని పడేయడానికి లేని దర్పం చూపిస్తూ దొంగతనాలు, దోపిడీలు చేస్తూ, అమ్మాయిలకి లేనిపోని ఆశలు చూపించి వలలు వేస్తున్నారు. అమాయకమైన అమ్మాయిలు వీళ్ళ మోసాలు తెలియక నమ్మి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలకి హద్దేలేదు. కానీ నిజం ;తెలిసిన ఏమి చేయలేక అప్పటికే చాలావరకు కూరుకపోయిన ఆడపిల్లలు నరకయాతనలు అనుభవిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కనుక ఎవరికీ చెప్పుకోలేరు. లేచిపోయి రావడం వలన కొందరికి ఎవరూ ఉండరు. జీవచ్చవాల్లా బ్రతుకుని నడుపుతున్నారు. ఇది ఇంకో కోణం...
అందరు అబ్బాయిలు అలా ఉండరు కదా!. కొందరు నిజాయితీగా ఇష్టపడతారు. ఒకసారి వీరికి కనెక్ట్ అయితే జీవితం ఇచ్చేస్తారు. ఇలాంటి వీరికి ఎదురయ్యే సమస్యలు కూడా చిత్రంగానే ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా పైకిరాలేరు. ఎందుకంటే నిజాయితీ అనే బోర్డ్ ఒకటి కట్టుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళంటే సంఘంలో చేతకాని వారిక్రింద లెక్క. వీళ్ళు ప్రేమించడానికి కాని, పెళ్లి చేసుకోవడానికి కాని అనర్హులు. బంధువుల్లో కూడా విలువలు ఉండవు. ఆస్థి ఉండదు. అంతస్తు ఉండదు. ప్రేమ మాత్రం కావలసినంత ఉంటది. కాని పంచుకోవడానికే ఎవరూ ఉండరు. స్నేహితులు కూడా తక్కువే. ఎందుకంటే ఎక్కడికైనా తీసుకెళ్తే ఖర్చు చేయలేరు. మోసపోవడం కోసమే పుడతారు. మోసపోవడం అనేదానికి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళే.
అమ్మాయిల్లో కూడా ఆణిముత్యాలు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమ్మాయిల్లో ఈ ;ఆణిముత్యాలు ఇలాంటి మంచివారికి దొరకడం కొంచం కష్టం. కొంచం కాదు చాలా! ఇలాంటి ఆణిముత్యాలు తొందరగా బయటికిరారు. వీరి జీవితాలు నాశనం చేసేది మాత్రం తల్లిదండ్రులే.
అమ్మాయిలకి కోరికలు పెద్దగా ఉండవు. వీళ్ళని కన్న తల్లిదండ్రులకి సవాలక్ష కోరికలు ఉంటాయి. తీసుకెళ్ళి చక్కని త్రాగుబోతు, తిరుగుబోతు, మోసగాళ్ళు, పనికిమాలిన మంద ఉండే కుటుంబాల్లో పడేస్తారు. చివరికి ఆణిముత్యాలు కాస్త మసకబారి బొగ్గులా తయారౌతున్నారు.
ఇంతకీ చెప్పేది ఏంటంటే! ఈరోజుల్లో మంచి చెడు ఎంచడం కొంచం కష్టం. ఐతే మాటలని బట్టి, చేతలని బట్టి, ఆన్లైన్ లో ఐతే వాళ్ళ టైం లైం ని బట్టి కొంతవరకు అంచనాకి రావచ్చు. కాకపోతే ఒక అడుగు వేసేముందు జాగ్రత్తగా అలోచించి అడుగువేయండి. తొందరపడి ఎవరిని వదులుకోవద్దు. ఎందుకంటే అప్పటికే దాదాపుగా చాలామంది మోసపోయి ఉంటారు కనుక మిమ్మల్ని కూడా వాళ్ళు మోసం చేస్తారేమో అనే ఆలోచనలోనే ఉండి త్వరగా కనెక్ట్ అవ్వలేరు. కనుక కొంచం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూసిన వెంటనే వెంటపడే పనికిరాని వాళ్ళని ఏరి పక్కన పడేయండి. ఏమాత్రం తేడ వచ్చినా మీకు సమస్యై కూర్చుంటారు. ఎవరికిపడితే వాళ్ళకి మీ నెంబర్ పంచుకోకండి. రిస్క్లో పడతారు. ఈరోజుల్లో అప్రమత్తత లేకపోతే జీవితాలు నాశనం అవుతాయి. ఎవరినీ నమ్మొద్దు. కాని తొందరపడి విడిపోవద్దు. అబ్బాయిల్లో కూడా ఆణిముత్యాలు ఉంటారు. ప్రాణం పెట్టేస్తారు. వీళ్ళని పట్టుకోవాలన్నా కూడా కష్టమే. కాని అమ్మాయిల్లా కాకుండా త్వరగానే దొరుకుతారు. కనుక తొందరపడి తొందరపాటు నిర్ణయాలని తీసుకుంటే కొందరిని కోల్పోవలసి వస్తుంది.
డబ్బు ఎప్పుడూ ప్రదానం కాదు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. డబ్బు ఉందికదా అని చేసుకుంటే పెళ్ళయ్యాక పొతే ఎం చేస్తారు? డబ్బులేనివాడు ఎప్పుడూ అలాగే ఉండడు కదా! నువ్వు తోడయ్యాక ఆస్థులు కూడబెట్టవచ్చేమో తెలియదు కదా! ఇప్పుడు సంపాదించిన వారిలో పెళ్ళయ్యాక సంపాదించినవారి 100 లో 98 మంది ఉన్నారు. ప్రకృతి పురుషుడు కలిస్తేనే జీవితం. ప్రకృతి ఒకదారిలో, పురుషుడు ఒకదారిలో వెళ్తే చివరికి మిగిలేది ఏమి ఉండదు.. మన్ను మశానమే మిగిలేది. దీని గురించి చెప్పాలంటే చాలావుంది.. పార్ట్ పార్ట్లు గ చెప్పుకుంటూ వెళదాం.
ఇంతకీ చెప్పిన విషయం అర్థం చేసుకోండి. త్వరపడి చిన్న చిన్న గొడవలలకి విడిపోవడం మాత్రం అలవాటు చేసుకోవద్దు. డబ్బుని లెక్కలో ఉంచుకోవద్దు.
No comments:
Post a Comment