శబరిమల కేరళ రాష్త్రంలోని.... పత్తినంతిట్ట జిల్లాలో
వుంది.దట్టమైన
అడవులతోనూ వన్య
మ్రుగాలతోనూ నిండివున్న
సహ్యాద్రి పర్వత శ్రేణులలో
సముద్ర మట్టానికి 4135
అడుగుల ఎత్తులో నెలకొని
వుంది.లభిస్తున్న
పురాణ,చారిత్రక ఆదారాలని
బట్టి కలియుగంలో ఆఖరీ
మరియూ ఏకైక
దైవం అయ్యప్పే.కార్తీక
మాసం నుండి అయ్యప్ప
మాలాదారణలు ప్రారంభమౌతాయి.మా
ల దరించాలనుకునా
భక్తుడు ముందుగా ఒక
ఉత్తముడైన గురువుని
ఎంచుకోవాలి.సాదారణంగా 5
పర్యాయలకన్నా
ఎక్కువసార్లు మలాదారణ
గావించి శబరిమల వెళ్ళివచ్చిన
స్వాములను గురుస్వాములుగానూ,
18 పర్యాయాలు శబరిమల
వెళ్ళివచ్చిన
స్వాములను పెద్ద
గురుస్వాములుగా
పిలుస్తారు.అయితే
మనం తెలుసుకో వలసిన
విషయం వారికి అయ్యప్ప
పట్ల,శబరిమల యత్ర పట్లా ఎంత
అవగాహన వుంది,వారు మిగతా
స్వాములకు ఆదర్శవంతమైన
జీవితాన్ని గడుపుతున్నారా
అని.కేవలం గణాంకాలని భట్టి
కాక వారికున్న విషయ
పరిజ్ణానాన్ని భట్టి
గురువుని
నిర్ణయించుకోవటం ఉత్తమం.మరైత
ే ఈ 5 సార్లు,18 సార్లు అన్న
నియమాలను ఎందుకు పెట్టినట్లు
?
ప్రతీ భక్తుడు శభరీశుని
డర్శించిన ప్రతీసారి
కామ,క్రోద,లోభ,మోహాది
అరిషడ్వర్గాలు,త్రిగుణాలు,వి
ద్య,అవిద్యలను 18 రకాల
వికారాలలో ఒక్కొక్క
దుర్గుణాన్ని
వదలిపెట్టి,ఆత్మను పరమాత్మలో
విలీనం చేసే యత్నం చెయ్యలి.ఈ
ప్రయత్నంలోనే వారు ఆ
శభరీశుని యాత్రా
వశిష్ట్యాన్ని,ఇరుముడి విదాన
విశేషాన్ని,అయ్యప్ప
తత్వాన్ని
తెలుసుకుంటారు.దాని ఫలితంగా
భక్తులు వారినుండి ఈ
విషయాలన్నిటినీ తెలుసుకునే
అవకాశం లభిస్తుంది.(కానీ
ఇటీవలి కాలంలో గురుస్వామి
అంటే కేవలం అదిక
పర్యాయాలు గుడికి
వెళ్ళివచ్చిన వాడై
వుండి,ఇరుముడి కట్టటం వస్తే
చాలు అనుకోవటం మన దురదృష్టం).
ఒక మంచి గురువుని
ఎన్నుకొనాక,దీక్ష
తీసుకోవటానికి
ముందురోజు పూర్తి
ఉపవాసం ఉండాలి.అంతేకాని
రేపటినుంచి కుదరదు కదా అని
దుర్వ్యసనాలన్నిటినీ ఆరోజే
తీర్చుకునే
ప్రయత్నం చెయ్యకూడదు.కొందరు ర
ాత్రి తాగినది దిగకుండానే
మరుసటి
రోజు మాలకు సిద్దమవుతున్నారు
,ఇదిచాలా ఘోరమయిన తప్పిదమే
కాక,కావాలని పాపాన్ని
మూటకట్టుకోవడమే.ముందురోజు దే
వాలయ సందర్శనం చేసి,ఉపవాసంతో
గడిపాక,మన
గురువుగారు సూచించిన
శుభసమయంలో దగ్గరలోని అయ్యప్ప
దేవాలయంలో గురువు గారి చేతుల
మీదుగా అయ్యప్ప దీక్ష
తీసుకోవాలి.
దీక్షా
నియమాలన్నిటినీ
గురువుగారు మాలాదారణ ముందే
తెలియజేస్తారు.వాటన్నిటినీ
త్రికరణశుద్దిగా
పాటించాలి.దీక్షలో ఏవైన
సందేహాలు వచ్చినట్లైతే
గురువర్యులనడిగి
తెలుసుకోవాలి.గురువు చెప్పే
ప్రతీ విషయాన్ని శ్రద్దగా
విని తూ.చ. తప్పక పాటించటమే
కాక గురువుపై అచంచల
విశ్వాసం కలిగివుండాలి.అయప్ప
దీక్షా నిమాలని పైన వున్న
పొస్టులలో అయ్యప దీక్షా
నియమాలు అన్న శీర్షికలో
జె.పి.జి ఫార్మాట్లో
ఉంచటం జరిగింది,చదివి
తెలుసుకొనగలరు.మండలకాలం దీక్
ష 48 రోజులు ( మండలము అనగా ఒక
మాసము+ఒక పక్షము+
మూడు రోజులు=30+15+3=48)
ముగిసాక,గురువుగారు సూచించిన
ఒక శుభముహూర్తాన మకర జ్యోతి
దర్శణార్థం శభరియాత్రకు పయనమ
ై ఇరుముడి
కట్టించుకోవాలి.బందుమిత్రుల
ు భిక్ష వేయగా
గురువుగారు ఇరుముడి కడతారు.ఈ
ఇరుముడిలో స్వామి
అఘిషేకార్థం ఆవునేతితో
నింపిన కొబ్బరికాయ,18
మెట్లవద్ద కొట్టేందుకు ఒక
కొబ్బరికాయ,మాళిగాపుర మాత
సన్నిదిలో దొర్లించేందుకు ఒక
కొబ్బరికాయతో పాటు ఒక
ఇరుముడి
కిట్టు(అమ్మవారికోసం గాజులు,
కాటుక
మొ.వి),బందుమిత్రులు వేసిన
భిక్షాబియ్యం ఉంటాయి.ఇరుముడి
కట్టే
కార్యక్రమం పూర్తయ్యేవరకూ పచ
్చిగంగ కూడా
ముట్టరాదు.ఇరుముడి కట్టే
కార్యక్రమం పూర్తయ్యక,భోజనాల
ు చేసి సూర్యాస్తమయం అయ్యాక
స్నానాలు,పూజా
కార్యక్రమం ముగుంచుకుని
శభరికి బయలు దేరుతారు.ఐతే
ఇరిముడి కట్టుకున్న తరువాత ఏ
సమయంలోనైన శబరికి
బయలుదేరవచ్చు.
శభరి యాత్రలో
భక్తులు రోడ్డు లేద
రైలు మార్గాల ద్వార
ప్రయాణం చేసి ముందుగా
ఎరుమేళి చేరుతారు.ఇక్కడ
ముందుగా వావరు స్వామిని
దర్శించుకున్నాకనే తనని
దర్శిస్తారని అయ్యప్ప
వావరుకు మాటిచ్చాడు.వావరు ఒక
ఇస్లాం మతానికి చెందిన ఒక
బందిపోటు దొంగ.సహ్య్తాద్రిలో
ప్రయాణించె భాటసారులని
దోచుకునేవాడు.అయ్యప్ప శబరికి
పోతూవుండగా
వావరు అడ్డగించాడట.నీవు ఈ
విదంగా
ప్రజలను ఎందుకు భాదిస్తున్నా
వని అయ్యప్ప
వావరును అడిగాడు.తనకు అపరిమిత
సంపదలు పొందాలని
వుందనీ,వాటిని అనుభవించాలని
చెప్తాడు వావరు.అయ్యప్ప
వావరుకి అనేక
మణులూ,రత్నాలు ఇస్తాడు.అయితే
అవి వెంటనే రాళ్ళుగా
మారిపోతాయి.వావరు కోపంతో
ఏమిటీ మాయ అని
అడుగుతాడు.దానికి అయ్యప్ప
బదులిస్తూ స్రుష్టిలో ప్రతీ
ఒక్కటీ అశాశ్వతమనీ,చివరికి
ఏదైన ఇలా మట్టిలో
కలసిపోవలసిందేనని చెప్తాడు.
ఆ మాటలు విన్న్న
వావరుకు జ్ణానోదయమౌతుంది.అన్
నిటినీ వదలి సత్యాన్వేషన
సాగిస్తాడు.తాను ముస్లిమయ్యి
కూడా హైందవ వేదాంతాన్ని
జీర్ణించుకోవటం వల్ల
వావరుస్వామిగా
పిలువబడి,అయ్యప్ప
అనుగ్రహానికి
పాత్రుడయ్యడు వావరు.కనుకనే
అయ్యప్ప తనని దర్శించటానికి
వచ్చే భక్తులు ముందుగా
నిన్ను దర్శిస్తారని
వావరుకు మాటిచ్చాడు
No comments:
Post a Comment