Find us on Google+ Alexander The Great Biography / History Incident Of Body Leaving Time | www.AndhraJyothi.co.in

Alexander The Great Biography / History Incident Of Body Leaving Time

Saturday, September 6, 2014
అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాతఇంటికి తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలోతీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు.తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్పగొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం,అంతులేని సంపద తన్ను మరణం నుంచిదూరం చేయలేవని స్పష్టమైపోయింది.ఇంటికి వెళ్ళాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికికడసారిగా తన ముఖాన్ని చూపించికన్ను మూయాలనే ఆశ. కానీ సమయం గడిసేకొద్దీ దిగజారుతున్న అతనిఆరోగ్యం అందుకు సహకరించడం లేదు.నిస్సహాయంగా ఆఖరి శ్వాసకోసం ఎదురు చూస్తున్నాడు.

తనసైన్యాధికారులనుదగ్గరికి పిలిచిఇలా అన్నాడు.“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచినిష్క్రమించబోతున్నాను. నాకు చివరగామూడు కోరికలున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూవాటిని నెరవేర్చకుండావిస్మరించకండి.”అని వారి నుండివాగ్ధానం తీసుకున్నాడు.అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారిఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆఅధికారులు.నా మొదటి కోరిక: ” నా శవపేటికను కేవలం నావైద్యులు మాత్రమే మోయాలి”రెండవ కోరిక: “నా పార్థివ దేహంస్మశానానికి వెళ్ళే దారిలోనేను సంపాదించిన విలువైనవజ్రాలు, మణిమాణిక్యాలు పరచండి”మూడవ కోరిక: “శవపేటిక లోనుంచి నా ఖాళీ చేతులు బయటికికనిపించే విధంగా ఉంచండి”చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయనవిచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీవారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగేధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒకసైనికుడు దగ్గరగా వచ్చి, ఆయనచేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పకనెరవేరుస్తామని మాట ఇచ్చాడు.

 ఈ కోరికల వెనకఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈమూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్నమూడు పాఠాలకు ప్రతిరూపాలు.”“మొదటి కోరికలో నా ఆంతర్యం,నిజానికి ఏ వైద్యుడూ మరణాన్నిఆపలేడు . ఒకవేళ వైద్యం చేసినావల్లకాటి వరకే.” అని చెప్పడానికి.“రెండవ కోరికలో నా ఆంతర్యం, నాజీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టడానికేసరిపోయింది.అదేదీ నా వెంటతీసుకెళ్ళలేక పోతున్నాననీ,కేవలం సిరిసంపదల వెంటబడివిలువైన సమయాన్ని, జీవితంలోమాధుర్యం కోల్పోవద్దనిచెప్పడానికి”“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈప్రపంచంలోకినేను వచ్చేటపుడు వట్టిచేతులతో వచ్చాను.ఇప్పుడు వట్టి చేతులతోనేవెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”అని చెప్పి కన్ను మూశాడు.అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల చక్రవర్తేకావచ్చు. కానీ ఆయన గురించిన ఈ సంఘటనలోభారతీయ ఆత్మ ఉంది. ఆధ్యాత్మిక సారంఉంది.అందుకనే ఈ సంఘటన అంటే నాకు ఎంతోఇష్టం

No comments:

Post a Comment