Find us on Google+ How To Clean Our Mind | www.AndhraJyothi.co.in

How To Clean Our Mind

Wednesday, September 10, 2014
Join In Our Google Plus Page శరీరాన్ని శుద్ధిచేసే విధానాల్లో ఇవి ఒకటి. వీటిని దైవచిహ్నాలు, దైవరక్షలు అంటారు. ఇవి ప్రదర్శన కోసం అనడం తగదు. అయితే కొందరు ఆడంబరం కోసం చేసి ఉండవచ్చు. కానీ అందరిదీ అదే పద్ధతి అనడం తగదుకదా. సంఘం దృష్టిలో గౌరవంగా కనబడడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అలంకరించుకుంటారు. అలాంటి అలంకరణలో భాగంగా కొందరు దీన్ని భావించవచ్చు. శాస్త్రరీత్యా - భ్రూమధ్యం జ్ఞానరూపుడైన దైవంయొక్క స్థానం. అక్కడ బిందురూపుడిగా భగవంతుని ధ్యానించే యోగ విధానమూ ఉంది. అలాగే రుద్రాక్ష, తులసి, స్ఫటికం - వీటి వైద్య మహిమలు కూడా ఇటీవల శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆధ్యాత్మికంగా కూడా ఈ చిహ్నాల ధారణ కచమవుతుందనీ, కనిపించని సూక్ష్మ జగత్తులో కూడా రక్షణనిస్తుందనీ మన పురాణాలు, మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. భక్తులైన వారికి దైవంపైనా, శాస్త్రం పైనా నమ్మకం ఉంటుంది. ఈ చిహ్నాల వల్ల దైవకృప, దైవచింతన నిరంతరం సన్నిహితమవుతుందని భక్తులు దీనిని ధరిస్తారు. అంతేకానీ ఆర్భాటం కోసం కాదు. బైట కనిపించేదంతా మనసులో ఉండకపోవచ్చు గానీ, మనసులో ఉన్నది మాత్రం బైట కనిపించి తీరుతుంది.

No comments:

Post a Comment