Find us on Google+ Kali Bhagavan Effects - Now A Days People Changes According To Kali Bhagavan | www.AndhraJyothi.co.in

Kali Bhagavan Effects - Now A Days People Changes According To Kali Bhagavan

Wednesday, September 10, 2014
Join In Our Google Plus Page హైందవ సంప్రదాయంలో అనేక మంది దేవతలకు అనేక శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చదివితే ఒక్కక్క ఫలితం అని ఫలస్మృతి ఉంటుంది. ఒకసారి చదివితే ఒక ఫలితం, వంద సార్లు చదివితే మరో ఫలితం, నిత్యం పటిస్తే ఈ ఫలితం, ఫలానా సమయంలో అంటే సంద్యా సమయంలో గాని, మరే సమయంలో అయినా కావచ్చు. ఎందుకంటే సమయాన్ని బట్టి మనం చదివితే ఫలితం త్వరగా వస్తుందని భావం. ఇలా అనేకరకాల ఉపాసనా పద్దతులు మన హైందవ సంప్రదాయంలో ఉన్నాయి. ఇలాగే వ్రతాలు, నోములు అని కుటుంబం కోసం నిర్దేశించినవి మరికొన్ని ఉన్నాయి. ఆరోగ్యం కోసం మరికొన్ని ఉన్నాయి. ఇలా ప్రతి విషయంలో కూడా ఆ విషయానికి సంబంధించిన అదిదేవతను అనుసంధానించే అనేకానేక మంత్రాలు, వాటి ఉచ్చరణలు, బీజక్షారాలు మన సంప్రదాయంలో సనాతనధర్మంలో ఎందరో ఋషులు ప్రత్యక్షంగా వీక్షించి మనకి అందించారు. కాని మనలో చాలామందికి ఉపాసనా మర్మాలు తెలియవు. ప్రత్యేకించి ఇప్పటివారికి ఇవి మూఢనమ్మకాలు అయిపోయాయి. చెప్పే ప్రయత్నం చేస్తే చాదస్తం అంటున్నారు. ఇలా చెప్పాలని ప్రయత్నించేవారిని వేలివేసినంతపని చేస్తున్నారు. ఇదే కలియుగధర్మం. ఈకలియుగంలో కలిపురుషుడు చేసే మొట్టమొదటి పని దైవనామ సంకీర్తనం ఏ ఇంటా లేకుండా చేయడం. ఇదే కలిపురుషుని లక్ష్యం. ఈపని చేస్తే తొందరగా బ్రష్టు పట్టించవచ్చు. కుటుంబాలకు కుటుంబాలని నాశనం చేసేయవచ్చు. వంశాలని కూకటి వేళ్ళతో సహా పెకిలించవచ్చు. ఇవన్ని చేయాలంటే దైవాన్ని ఎదిరించాలి. అందుకే చాలామంది మనస్సులో తిష్టవేసుకొని కూర్చున్నాడు. కలిచేత అవహించబడి ఉన్నవారు అన్నివిషయాల్లో ముందు నేనున్నాను నీకెందుకు అంటూ వెనుకనుండి నెడతారు. అసలువిషయం వచ్చేసరికి పారిపోతారు. సలహాలు సూచనలు ఇస్తారు. లేని అలవాట్లు చేస్తారు. ఇన్ని చేసి భక్తి విషయంలోకి వచ్చేసరికి భక్తుడిలా నటిస్తారు. లేదా నాస్తికుడిలా మారిపోతారు. ఎవరైనా భక్తికి సంబంధించి ఏదైనా చెపితే తురకవాదం చేస్తారు. ఆ వాదన విన్నవారికి కూడా నిజమే అనిపించెంతలా మాట్లాడతారు. మొత్తం మీద ఈ మూర్ఖుడు మరో కొందరు మూర్ఖులను తాయారు చేస్తాడు. ''అందుకే మన పెద్దలు అంటారు. నాస్తికులతో స్నేహం, భక్తులతో ఖేదం పనికిరాదు.'' అని. ఈవిధంగా ఎన్నో విధాలుగా దైవనమస్మరణ చేయకుండా అడ్డుపడుతూనే ఉంటాడు. ఎందుకంటే కలియుగ ప్రత్యేకత కేవలం దైవనామ స్మరణ మాత్రమే. కొంతమంది భక్తులు కూడా గుడికి వెళ్లి నమస్కరిస్తారు, ఇంట్లో పూజలు చేస్తారు కాని భగవంతుని లీలలు, భవత్కతలు వినాలంటే మాత్రం మనస్సురాదు.

ఇక విషయంలోకి వద్దాం.

మనిషి ఎప్పుడు ఐదు స్థితులలో ఉంటాడు. 1. సృష్టి-పుట్టడం, స్థితి-బ్రతకడం, లయ-నిద్రించడం లేక మరణించడం, తిలోధార(బంధం), అనుగ్రహ(మోక్షం). మొదటి నాలుగు కొన్ని సంబంధం ఉండి, కొన్ని లేక జరుగుతున్నాయి. కాని చివరిది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే బంధం అడ్డుతగులుతుంది. ఈ బంధాన్ని దాటి ముందుకు వెళితే పరబ్రహ్మ తత్త్వం తెలుస్తుంది. ఆ తత్త్వమే సర్వం వాసుదేవమయం. అది తెలుసుకోవడమే మోక్షం. ఇవి పొందడం కోసం మనకి ఋషులు ఎందఱో బీజాక్షరాలతో కూడిన శ్లోకాలు, మంత్రాలు మనకి అందించి చదవమన్నారు. ఇవి చదువుతూ ఉంటే వాటి ఫలాలు మనకి అందుతాయి. ఎలాగంటే మానవుడి దారి మోక్షప్రాప్తి. ఆ దారిలోకి అడుగుపెట్టే విధంగా మనం చదివే శ్లోకాలు మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. ఎప్పుడైనా ఒకసారి చదువుతుంటే అది జన్మజన్మలకు ''ఇంతింతై వటుడింతై అన్నట్లు'' మీకు తోడుగా వచ్చి మీలో నిద్రావస్థలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. వారానికో నెలకో చదువుతుంటే ఇంకొంచం త్వరగా మేల్కొంటుంది. అదే నిత్యం చదువుతూ ఉంటే ఇంకా త్వరగా చైతన్యం మేల్కొని జన్మలు తరిగిపోయి మోక్షప్రాప్తికి సుగమం ఏర్పడుతుంది. అంటే మనం చదివే విధానాన్ని బట్టి మనలో ఉన్న చైతన్యం మేల్కొంటుంది. ఇవి చదవాలి అంటే మనలో దీక్ష, పట్టుదల ఉండాలి. ఒకరోజు , రెండు రోజులు, వారం రోజులు చదివి వదిలేయకూడదు. మొదట్లో కొంచం కష్టం అనిపిస్తుంది. కాని నిరంతర సాధన చేయగా చేయగా మనదేహం అలవాటు పడుతుంది. మధ్యలో కలిపురుషుడి వలన ఎన్నో అడ్డంకులు కూడా తగులుతాయి. అవి ఇంట్లో ఉండవచ్చు, బయటి నుండి రావచ్చు. ఏది వచ్చినా పట్టుదలతో ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా యిట్టె తొలగించవచ్చు.

ఐతే మనలో ఎన్నో విషయాలకి లొంగిపోయే గుణాలు ఉంటాయి. కలి ముందుగా వాటినే చూస్తాడు. ఎందులో ఐతే తొందరగా పడి వెళ్ళే దారి నుండి పక్కకి తప్పుకుంటావో చూసి వాటి మీద దృష్టి కేంద్రీకరించి నీ దృష్టిని ఆ మార్గం నుండి తప్పిస్తాడు. భార్య రూపంలో, తల్లిదండ్రి రూపంలో, బిడ్డల రూపంలో, ఉద్యోగ-వ్యాపార, స్నేహ, బంధు రూపంలో ఇది అది అని కాకుండా ఎలాగైనా రావచ్చు, అన్నిటికి ఎదిరించి నిలబడాలి. అప్పుడే విజయం సాధిస్తారు. అమ్మయిల కోసమో, ఆస్తుల కోసమో, ఉద్యోగ-వ్యాపార, స్నేహం కోసమో లేక మరే ఇతర వస్తువుల కోసమో తెగించడం అంటే అది బంధంలో నిన్ను నువ్వు ఇరికించుకోవడం తప్ప మరొకటికాదు. ఇక్కడ ఒక సందేహం వస్తుంది అందరికి. ఇలా మోక్షం మోక్షం అంటూ తిరిగితే సంపాదన ఎలా? అని పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు ఒక్కటే.

నువ్వు నమ్మింది బంధు మిత్ర, సపరివారం కాదు. దైవాన్ని నమ్ముకున్నావు. ఎలాంటి సమస్య గాని, ఆర్థిక పరమైన ఇబ్బందులు గాని రావు. నేనే ఇందుకు సాక్ష్యం. నా జీవితంలో అనుకోని ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇంకా ఉంది..

No comments:

Post a Comment