Find us on Google+ Lord Anjaneya 32 Very Powerful Mantras Prayed By Lord Brahma | www.AndhraJyothi.co.in

Lord Anjaneya 32 Very Powerful Mantras Prayed By Lord Brahma

Wednesday, September 10, 2014
స్వయంగా బ్రహ్మ దేవుడు చెప్పిన ఆంజనేయుని 32 నామములు::: లంకిణిని హనుమంతుడు దెబ్బకొట్టడం మనకి తెలుసు. ఆ సంఘటన తర్వాత దేవతలు కుసుమవృష్టి(పూలవాన) కురిపించారు ఆంజనేయస్వామి వారిమీద. కుసుమ వృష్టి కురిపించగనే బ్రహ్మదేవుడు స్వయంగా దిగివచ్చాడట గగనం నుంచి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఆయన స్వయంగా దిగి వచ్చి బ్రహ్మగారు హనుమంతుని స్తుతి చేస్తారు.ఆ స్తుతి చేసేటప్పుడు 32 ఆంజనేయ నామాలు అంటారాయన. ఇవి విశేషమైన అంశం. 32 హనుమన్నామాలు. ఈ 32 హనుమన్నామాలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్తుతించాడు. ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనపడుతున్న లీలారూపం వేరు. ఆయనలో ఉన్న మంత్రమూర్తులేమిటో వేదములు తెలిసిన బ్రహ్మ గారికి తెలుస్తుంది కానీ ఇంకెవరికి తెలుస్తుంది? అందుకు 32 నామములతో హనుమంతుని కీర్తన చేస్తారు.

ఈ 32 నామాల వరుసని సుందర మంత్రము అంటారు. సుందర హనుమన్మంత్రము అంటే 32 నామాల వరుస. ఈ 32 నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది. ఇదీ రహస్యం. అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం బ్రహ్మగారిది. ఇది రహస్యం. సంహితా గ్రంథాలలో ఉంటుంది. ఎవరైతే ఈ నామాలు పఠిస్తారో వారికి అన్నిరకాల ఆధివ్యాధులు నశిస్తాయి. ఇందులో 27 ముఖ్యంగా తీసి చూపిస్తున్నారు. హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః కపీంద్రః పింగళాక్షశ్చ లంకా ద్వీప భయంకరః ప్రభంజన సుతః వీరః సీతాశోక వినాశకః అక్షహంతా రామ సఖః రామకార్య దురంధరా మహౌషధ గిరేర్హారీ వానర ప్రాణదాయకః వాగీశ తారకశ్చైవ మైనాక గిరిభంజనః నిరంజనో జితక్రోధః కదళీవన సంవృతః ఊర్ధ్వ రేతా మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః మహాలింగ ప్రతిష్ఠాతా బాష్పకృత్ జపతాం వరః శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః!! ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు. 27 నామాలు కలుపుకుంటే దీనికి సుందరహనుమన్మంత్రము అని పేరు. 5 రహస్య నామములుగా చెప్పారు. కనుక 27 ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతోంది. కనీసం విని ఆనందించినా చాలు. గుర్తు పెట్టుకోలేకపోయినా..

No comments:

Post a Comment