Find us on Google+ Shatrunjaya Palitana Gujarat Temple History | www.AndhraJyothi.co.in

Shatrunjaya Palitana Gujarat Temple History

Wednesday, September 10, 2014
Join In Our Google Plus Page ఒకే కొండపై వేయి కి మించిన దేవాలయాలు..... . కొండల పైన దేవాలయాలు సాధారణంగా నిర్మిస్తారు. అయితే, ఒకే ఒక విశాలమైన కొండపై వేయి కి మించిన దేవాలయాలు వుంటే ఎలా ? కాని ఇది వాస్తవం . మరి ఇది ఎక్కడ వుంది ? గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో పాలితానా అనే ఊరిలో శత్రున్జయ కొండపై అపురూపమైన ఈ లెక్కకు మించిన దేవాలయాలు చూడవచ్చు. ఈ ఊరి అసలు పేరు పాలితానా కాగా దానిని కూడా మరచిన ప్రజలు దీనిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఇది జైనులకు అతి పవిత్రమైన ప్రదేశం. భగవంతుడి కొరకు నిర్మించిన ఈ దేవాలయ నగరంలో రాత్రి వేళ దేవాలయ అర్చకులు తప్ప ఇతరులు ఎవరూ ఇక్కడ నిద్రించరు. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ తీర్ధ యాత్ర చేస్తే గాని మోక్షం లభించదని జైనులు భావిస్తారు. సుమారు 1800 అడుగుల ఎత్తులో కల ఈ కొండ ఎక్కడానికి 3745 మెట్లు కలవు

No comments:

Post a Comment