నిత్యం సోషల్ సైట్స్ లో అమ్మాయిలు/అబ్బాయిలు ఎవరో ఒకరికోసం వెదుకుతూనే ఉంటారు. కొందరికైతే తెల్లారి లేచిన దగ్గరనుండి పడుకునేవరకు ఇదేపని. తినడం సొల్లు కొట్టడం. ఇదే పనిమీద ఉన్నారు చాలామంది. కాని కొందఱు మాత్రం పలకరిస్తేనే పులకరించిపోతున్నారు. కొందరు పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నారు. కొందరు ఎలాగైనా అమ్మాయిని/అబ్బాయిని పడేయాలని ప్రయత్నిస్తున్నారు. బకరాలు ఎవరు దొరుకుతారా! అని చూడడమే పని. ఇంకేపని పెట్టుకోరు. కాని పత్తిత్తుల్లా మాట్లాడతారు. ఇదంతా నమ్మితే నట్టేట్లో మునిగినట్లే. ఇదంతా ఎలా ఉంటదంటే! వివాహభోజనంబు సినిమాలో కోటాగారు కోడిని పైన వ్రేలాడతీసి చూస్తూ ఉత్తి అన్నం మాత్రం తిన్నట్టు ఉంటది. ఇంతకంటే చెప్తే చండాలంగా ఉంటాడని చెప్పడంలేదు. అర్థం చేసుకోండి చాలు. బాధపడేది మాత్రం నమ్మినవారే. అబ్బాయిలని బకారాలని చేయడంలో మాత్రం అమ్మాయిలు ముందు ఉన్నారు. అందరు కాదులెండి. కొందరు మాత్రం ఆణిముత్యాలు కూడా ఉన్నారు.
ఎన్నో ఎదురుదెబ్బలు తింటేకాని ఈ ఆణిముత్యాలు దొరకవు.
తొందరపడి మనస్సివ్వడం, పెళ్లి చేసుకుంటానని కమిట్ అవ్వడం లాంటివి చేయకండి. ఎక్కువ శాతం ఆన్లైన్ లో పనికిమాలిన మందే ఉంది. ఇటు అమ్మాయిలని, అబ్బాయిలని ఎవరిని నమ్మడానికి లేదు. ఎక్కువశాతం హాయ్ బై దగ్గరే ఆగిపోండి. లేదంటే కొన్ని జీవితాలు ఆగిన, ఆపుకున్న సంఘటలను కూడా ఉన్నాయి. మోసపోయిన వారి సంఖ్యా లక్షల్లో ఉంది. అమ్మాయిలు ఎందుకు మాట్లాడతారో ఎందుకు ఎస్కేప్ అవుతారో వారికే ఎరుక. ఒక వింత పాత ఒకరోత అనే సామెతని బాగా ఆచరిస్తున్నట్లు ఉన్నారు. అబ్బాయిల చెప్పే పనేలేదు. అమ్మాయి పేరు కనబడితే చాలు! వాళ్ళు ఎలాంటివారు! ఏ వయస్సు వారు, అసలు వాళ్ళు చెప్పేది నిజమా! కాదా! అనేది కూడా చూడకుండా లవ్ ప్రపోజల్, వెంటనే పెళ్లి ప్రపోజల్ చేసేయడమే. ఇంకా లోతుకువెళితే బాగోదు కనుక ఆపేస్తున్నా!
ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. మాట్లాడుతున్నారు కదా అని నమ్మకండి. నట్టేట్లో మీరు ప్రయాణం చేసే పడవకి చిల్లుపెట్టి మరీ వదిలేస్తారు. మునిగిన తరువాత కాని తెలియదు చిల్లుపెట్టిన సంగతి.
జీవితమే ముఖ్యం. మిగిలినవి తరువాత! నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో. అమ్మాయి/అబ్బాయి, ఐశ్వర్యం వాటంత అవే వెదుక్కుంటూ వస్తాయి.
No comments:
Post a Comment