Find us on Google+ What Kind Of Qualities To Check Before Marriage | www.AndhraJyothi.co.in

What Kind Of Qualities To Check Before Marriage

Wednesday, September 10, 2014
ఆడపిల్లల తల్లిదండ్రుల చేష్టలకి బలౌతున్న మధ్యతరగతి కుటుంబాలు. ఆడపిల్లల తల్లిదండ్రులు చేసున్న అకృత్యాలు అన్ని ఇన్ని కావు. మా పిల్లకి అన్ని ఇచ్చాము అని సంకలు గుద్దుకోవడమే తప్ప, అసలు ప్రేమించడం నేర్పించారా! సంస్కారం నేర్పించారా అనేది ఆలోచించడం లేదు. అడిగినదల్లా కొనిచ్చి,లేకపోతె అప్పైన చేసి ఆడపిల్లలకి చేసిపెడుతున్నారు. ఇది ఎంతదూరం వెళుతుందో ఆలోచించడం లేదు. ఇలా పెంచి భర్తమీదకి వదులుతున్నారు. ఆ భర్త భార్యకి నచ్చజేప్పలేక చస్తున్నాడు. నిత్యం గొడవలే భార్యాభర్తల మధ్యలో. ఇది కావాలి, అది కావాలి అని తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు నానాయాతనలు పడుతున్నారు భర్తలు. భర్త అంటే భరించేవాడు కనుక కొందరు ఏదో సర్దుకుపోయినా, యువత మాత్రం ప్రేయసి కోర్కేలు తీర్చడానికి దొంగతనాలకు సైతం వెనుకాడడం లేదు. ఇంతా కష్టపడి మెప్పించినా చివరికి ప్రియుడికి మిగిలేది మాత్రం ఏడుపే.

 ఇకపోతే ఒక యువకుడికి 25ఏళ్ళు వచ్చిన దగ్గర నుండి అతడి తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కాని ఏదో ఒక వంకతో సంబంధాలు అన్ని తప్పిపోతున్నాయి. ఈ వంకల అన్నిటిలో మాత్రం ఒకటి కామన్ గా వినిపించేది. ఆస్థి, ఇల్లు లేదు. పర్మనెంట్ ఉద్యోగం లేదు. ఇది విని విని విసుగొచ్చి ఎంతదూరం వెళ్లిందంటే, అప్పటివరకు కొడుక్కి ఇంట్లో ఉన్న లేకపోయినా అప్పోసోప్పో చేసి చదివించి ప్రయోజకుడిని చేయడానికి నానా కష్టాలు పడ్డారు. ఉన్న పోలం అమ్మేసారు. అప్పులు చేశారు. చివరికి ఒక తీరం చేర్చారు. కొడుకు ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులని ప్రేమగా చూసుకునేవాడు. ఈ వచ్చిన సంబధాలలో అమ్మాయి తరుపున అడిగిన కోర్కేలకి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ అంతా ఆవిరైపోయి ''నువ్వు సంపాదించలేదు. ఇల్లులేదు, పొలం అమ్మేశావు. ఆస్తులు ఏమి లేవు. ఇంకెవరిస్తారు పిల్లని. నీ చేతగాని తనానికి నేను బలైపోతున్నా'' అంటూ సాగిన గొడవ25 నుండి 32కి వచ్చిన కొడుక్కి ఏమి చేయలేకపోయానే, చివరికి పెళ్లి కూడా చేయలేక పోతున్నానే అనే బాధలో తండ్రి చేసుకున్న ఆత్మహత్యతో ఆగింది.

. అబ్బాయి బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజినీర్,నెలకి 60వేల జీతం. సంవత్సరంలో ఇల్లు కట్టుకుంటారు. అబ్బాయి దబ్బపండులా ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటాడు. ఒక సంబధం వచ్చింది. అబ్బాయి విషయంలో అన్ని నచ్చాయి కాని ఇల్లు లేదు. సంవత్సరంలో కట్టుకుంటాము అన్నా గాని ఆడపిల్ల తరుపువారు వినలేదు. (ఈ సంబంధానికి నేనే సాక్ష్యం). వద్దని వెళ్ళిపోయారు. అమ్మాయి చూడడానికి చాలా అసహ్యంగా ఉంటది. కోర్కెలు మాత్రం ఆకాశంలో విహారం చేస్తున్నాయి. తీరా ఆరాతీస్తే! ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఇల్లు కట్టించాడు. ఇది కొడుక్కి దక్కుతుంది కనుక అమ్మాయి ఆలోచన ఏంటంటే! ''మీ అబ్బాయికి ఇల్లు కట్టించావు. నాకు ఇల్లు లేనివాడిని చూసి చేసుకోమంటావా''! అని. ఇలాంటి పెంపకం పెంచుతున్నారు. ఇటు అమ్మాయి తండ్రికి అమ్మాయిని నచ్చజెప్పే అవకాశాన్ని కోల్పోయాడు. ఏమి సమాధానం చెప్తాడు?

అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం. సొంత ఊర్లో బాగానే సంపాదించారు. అబ్బాయి చూడడానికి చాలా బావుంటాడు. కాని ఇల్లు లేదు. ఇది కూడా చెడింది. ఆస్థి ఉన్నా, ఇల్లు లేదని కొందరు, ఆస్థి ఇల్లు లేకపోయినా నెలకి అరలక్షకి పైగా సంపాదిస్తున్నా వద్దని కొందరు, ఇలా ఏదో ఒక వంకతో ఇలాంటి సంబంధాలు వద్దంటున్నారు. వీటినే వద్దు అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అస్థిపాస్తులు లేకపోతె ఎందుకూ పనికిరాని వారి క్రింద సమాజం లెక్కవేస్తుంది. దీనివలన అబ్బాయి తరపున ఉండే కుటుంబాలు కుటుంబాలు నాశనం అవుతున్నాయి. గొడవలు, ఆత్మహత్యలు. నరకం అనుభవిస్తున్నారు. ఇవన్ని జరిగిన యథార్థ సంఘటనలే. నేను కల్పించినవి కాదు. రెండోవాడు స్వయంగా నా మేనల్లుడు. ఇల్లే అన్ని చేసిపెడుతుందా? ప్రేమతో చూసుకునేవాడు అవసరంలేదు నేటి ఆడపిల్లలకి గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకి గాని. ఆస్థి, ఇల్లు ఉంటే చాలు. పెళ్లి జరిగిన తెల్లారి పెళ్ళికొడుకు చచ్చినా పర్లేదు. ఆస్థితో, ఇంటితో కలిపి కాపురం చేస్తారు. నేటి ఇలాంటి సమాజంలో ఇలాంటి పెళ్ళికాని ప్రసాదులు వేల సంఖ్యలో ఉన్నారు. ఆడపిల్లలకి ఎంత కట్నం ఇచ్చాం. ఎంత ఆస్తులు ఉన్న సంబధం తెచ్చాం అని కాదు చూడవలసింది. కుర్రాడు మంచోడా? కాదా? ఇది చూడండి. అన్ని ఉండి పెళ్ళయ్యాక, పెళ్ళికొడుకు పోరంబోకని తెలిస్తే ఎం చేస్తారు. ఆడపిల్లకి అన్యాయం చేసినట్లేగా? ఆస్థి ఏమైనా చేసిపెడుతుందా? భర్త సరిగా లేనపుడు ఆస్తిని ఎం చేసుకుంటుంది? ఒకవేళ ఆస్థి పొతే! ఎం చేస్తారు?

మీలాంటి తల్లిదండ్రుల వలన ఆడపిల్లల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. అయ్యాయి కూడా! (ఇవి కూడా నేను చూసాను). నిన్న రాత్రి మా ఇంటి మేడమీదకి జ=కొత్తగా అద్దెకి వచ్చిన జంట.భర్త భార్య తరుపున ఆస్థి కోసం గొడవపడి కొట్టుకొని ఇద్దరు ఇంటికి గడియ కూడా వేయకుండా వెళ్ళిపోయారు. మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటి? అబ్బాయికి ఆస్థి మొత్తం రాసిస్తార? ఉన్న ఆస్థిని తగలేట్టిన వాడు, ఒకవేళ అమ్మాయి తరుపు ఆస్థి రాసిచ్చినా ఉంచుతాడని నమ్మకం ఉందా? ఆడపిల్లులు, వారి తల్లిదండ్రులు కొంచం ఆలోచించండి. డబ్బు అవసరంలో ఎప్పుడు ఉపయోగపడదు. డబ్బు ఉన్నా లేకపోయినా స్నేహం, ప్రేమ మాత్రమే తోడుగా ఉంటుంది.

No comments:

Post a Comment