ఆకాశాత్ పతితంతోయం యథా గచ్ఛతి సాగరః |సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||మబ్బులనుండి కురిసే ప్రతీ నీటి బిందువూ సాగరంలో కలిసినట్టే,మన౦ ఏరూపంలో ఆరాధించినప్పటికీ అన్నీ ఆ కేశవుడికే చేరుతాయి.
కేశవుడు అంటే నారాయణుడు
నారాయణుడే పరమదైవం అని
మన వేదాలు చెప్తున్నాయి.
కేవలం స్మరణ ధ్యానంతో
నారాయణుడు పరవశుడై
భక్తులను ఆర్తులను రక్షిస్తాడు
అందుకే పరమశివుడు సదా
రామ కృష్ణ నారాయణ ఇత్యాది
కేశవనామ స్మరనతో పులకిస్తాడు.
నారాయణధ్యానంతో తరిస్తాడు.
అందుకే శివుడు విష్ణుమయుడు.
శివుడు అర్చన అభిషేకముకు పరవశిస్తాడు అందుకే విష్ణువు తన
అవతారములలో శివుడిని పూజించి
అర్చించి పులకిస్తాడు అందుకే విష్ణువు శివమయుడు.
అందుకే వీరు ఇరువురకు భేదంలేదు
భేదం చూపు వాడు అఙ్నాని
మూర్ఖుడు అని వేరే చెప్పనక్కరలేదు.
పరమాత్మ ఒక్కడే మనం ఆయనను
ఏ రూపంలో పూజించినా అది ఆ కేశవుడికే చెందుతుంది.
No comments:
Post a Comment