1)శనీశ్వరుడు గురించి మీకు ఒక నిజం తెలుసా?
2)ఎందుకు శనీశ్వరుడు అంటే అందరికీ అంత భయం చెప్పండి?
3)ఏ ఆయన దేవుడు కాద!
4)మీ అందరికీ ఆయన గురించి ఒక నిజం తెలుసా?
నవగరహాలలో అందరికన్నా మంచి గ్రహము శనీశ్వరుడే.
శనీశ్వరుడు వాయు (గాలి) కారకుడు. మనం బ్రతకడానికి కావలిసిన
శ్వాస,నిశ్వాసల కారకుడు శనీశ్వరుడే. అంటే ఆయనే లేకపోతే
మనం బ్రతకలేము.
*****గోచారరీత్యా శని 3రకాలుగా వస్తుంటాడు******
1.ఏలినాటి శని
2.అర్దాష్టమ శని
3.అష్టమ శని
ఏలినాటి శని:
ప్రస్తుతం కన్య,తుల,వృశ్చికం రాశుల వారికి ఏలినాటి శని
నడుస్తుంది.
అనగా: ఉత్తర.2,3,4 పాదములు.
హస్త.1,2,3,4 పాదములు.
చిత్త.1,2,3,4 పాదములు.
స్వాతి.1,2,3,4 పాదములు.
విశాఖ.1,2,3,4 పాదములు.
అనూరాధ 1,2,3,4 పాదములు.
జేష్ట 1,2,3,4 పాదములు.
అర్దాష్టమ శని:
ప్రస్తుతం కర్కాటక రాశి వారికి అర్దాష్టమ శని నడుస్తుంది.
అనగా: పునర్వసు 4వ.పాదము.
పుష్యమి 1,2,3,4.పాదములు.
ఆశ్లేష 1,2,3,4.పాదములు.
అష్టమ శని:
ప్రస్తుతం మీన రాశి వారికి అష్టమ శని నడుస్తుంది.
అనగా: పూర్వాబాద్ర. 4వ పాదము,
ఉత్థరాబాద్ర .1,2,3,4.పాదములు.
రేవతి. 1,2,3,4 పాదములు.
పై రాశుల వారు ప్రతీ శనివారము ఉదయాన్నే తలంటుకొని
స్నానంచేసి, వీలైతే కారునీలము రంగు వస్త్రములు ధరించి,
శనీశ్వరాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది.
శో,,ఓం కాకధ్వజాయ విద్మహే
ఖడ్గ హస్తాయ ధీమహి
తన్నోమందః ప్రచోదయాత్!!
ఈ శ్లోకమును పై రాశుల వారు ప్రతీ శనివారము ఉదయాన్నే
తలంటుకొని స్నానంచేసిన తరువాత 108 సార్లు ,కాని పక్షాన 11
సార్లు చదుకున్నచో మంచిది.
No comments:
Post a Comment